అంకిత భావంతో విధులు నిర్వర్తించాలి` ఎస్పీ జి ఆర్ రాధిక
శ్రీకాకుళం: (8టెలివిజన్ క్రైంన్యూస్) అంకిత భావంతో విధులు నిర్వర్తించి ఇటు ప్రజలకు ,అటు పోలీసులకు సంధాన కర్తలుగా వ్యవహరించి ప్రజారక్షణ కు భద్రతకు కృషిచేయాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు.మంగళవారం జిల్లా ఎస్పీకార్యాలయంలో మహిళాపోలీసులు విధివిధానాలు ,ప్రజాభద్రత,రక్షణకై తీసుకోవలసిన చర్యలుపై జిల్లా ఎస్పీ వీడియెకాన్ఫురెన్సు నిర్వహించారు.మేమున్నామన్నా భరోసా ప్రజలుకు కల్పించాలని విధులు పట్ల అంకిత భావం చూపించాలని,క్షేత్రస్దాయిలో ప్రజలు సమస్యలు గుర్తించి మానవీయ కోణంలో పరిశీలించి సమస్యలు పరిష్కరించేవిధంగా వుండాలని తెలిపారు.మహిళలు పై జరుగుతున్న నేరాలు,ఆసాంఘిక కార్యక్రమాలువల్ల కలిగే దుష్పలితాలు గురించి అవగాహన కల్పించాలని అన్నారు.సమన్వయంతో పనిచేస్తే నేరచరిత్ర నియంత్రంచగలమని తెలిపారు.