అక్కడ సముద్రం భయపెడుతుంది…
గత 40సంవత్సరాలు గా ఎపుడు సముద్రం ఇంతగా భయపెట్టలేదని అక్కడ ప్రాంత వాసులు అంటున్నారు.సముద్రం అల్లకల్లోలంగా మారి కెరటాలు ఉవ్వెత్తున ఎగురుతుండడంతో జనం భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు.విశాఖపట్నం జిల్లా యారాడ సముద్రతీరం జనాల్ని భయపెడుతుంది.రోడ్లును తాకుతూ అలలు రావడంతో ఏమి జరుగుతుందో నని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.తీరం వెంబడి సముద్రఘోష భయంకరంగా వుండడడంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని ప్రజలుకు కంటిమీద కునుకులేకుండా పోతుంది.అలలు తాకిడికి సముద్రతీరం కోతకు గురవుతుంది.