అత్యవసర సేవలుపై అవగాహన అవసరం
శ్రీకాకుళం: అత్యవసర సేవలు తక్షణమే అందించేందుకు వైద్య సిబ్బంది సిద్దంగావున్నా వాటిని ఉపయోగించుకునేందుకు ప్రజలుకు అవగాహన కల్పించాలని శ్రీకాకుళం ట్రాఫిక్ డిఎస్పీసిహెచ్‌జివి ప్రసాదరావు అన్నారు.శ్రీకాకుళం డేఅండ్ నైట్ కూడలి వద్ద మెడికవర్ ఆద్వర్యంలో శనివారం నిర్వహించిన ఎమెర్జీన్సీ మెడిసన్ డే కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అత్యవసర వైద్యసేవలుపై ప్రతి ఒక్కరికీ అవగాహన వుండాలని ప్రస్తుత కాలంలో అనేక వ్యాదులు ఎమెర్జీన్సీని తెచ్చిపెడుతున్నాయని అందువల్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని అన్నారు.ప్రస్తుతం గుండెపోటు,బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాదులు ప్రాణాంతకంగా మారుతున్నాయని అందువల్ల ముందస్తు జాగ్రత్త లు పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెడ్ ఆఫ్ ఎమెర్జీన్సీ డిపార్టుమొంటు కు చెందిన బాల సూర్యప్రకాశ్,సెంటర్ హెడ్ సాగరిక ట్రాఫిక్ ఎస్‌ఐలు వెంకటేష్,సోమశేఖర్ ,పోలీసులు వైద్య సిబ్బంది పాల్గోన్నారు.