అన్ని వర్గాలకు సమ న్యాయం
శ్రీకాకుళం: అన్ని వర్గాలకు సమన్యాయంతో ముఖ్యమంత్రి వున్నారని దానికి ఉదాహరణే ఎమ్మేల్సీ అభ్యుర్దులు ఎంపికేనని రాష్ట్ర రెవెన్యూశాఖామంత్రి దర్మాన ప్రసాదరావు అన్నారు.శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాలుకు సీట్లు కేటాయింది,సమన్యాయం చూపించారని అన్నారు.పార్టీకి సేవ చేసినవారికి సిఎం గుర్తించి తగు న్యాయం చేస్తారని దానికి అద్దంపట్టేవిదంగా నర్తురామారావు ఎమ్మేల్సీ ఎంపికే నని అన్నారు.ఈ సందర్బంగా నర్తు రామారావు మాట్లాడుతూ పార్టీకి నాడు రాజశేఖర్‌రెడ్డి వున్నప్పటనుండి మూడు దశాబ్దాలుగా పార్టీకీ సేవచేయుడం జరుగుతుందని ఎదో ఒక రోజు నాకు గుర్తింపుపార్టీలో వస్తుందని ఆశించానని ,అది ఈ రోజు నిజమైందని సంతోషం వ్యక్తుంచేశారు.అంతకుముందు మంత్రి శాలువా కప్పి సత్కరించారు.