అమ్మదయవుంటే అన్నీవున్నట్లే

0
99
telugu news

అమ్మదయవుంటే అన్నీవున్నట్లే
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బలగవద్ద నాగావళినదీతీరంలో వెలిసిన ప్రముఖదేవాలయం అయ్యప్ప దేవాలయంలో శ్రావణ మాసం నాలుగవ శుక్రువారం పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మివ్రతాలు నిర్వహించారు.ఆలయ ప్రదాన అర్చకులు దేవరకొండ శంకరనారాయణశర్మ ఆద్వర్యంలో ఈ కార్యక్రమం జరిపారు.అమ్మవారుకు ప్రత్యేక అలంకరణ నిర్వహించారు.ఈ సందర్బంగా ఆలయంలో చక్రార్చన జరిపారు.కుంకుమార్చనలు,అమ్మవారికి వేదపండితులు వేదమంత్రోచ్చరణ నడుమ శాస్త్రయుక్తంగా జరిపారు.ఈసందర్బంగా శంకరనారాయణశర్మ మాట్లాడుతూ అమ్మదయవుంటే అన్నీ వున్నట్లే,శ్రీమహాలక్ష్మి అమ్మవారు కరుణాకటాక్షాలు అందరికీ కలగాలని,ఈవ్రతాలలో ఎవరు పాల్గోంటారో వారికి అష్టఐశ్వర్యాలు కలుగుతాయని అన్నారు.ఆలయ కమిటీ అద్యుక్షుకార్యదర్శలు రెడ్డి చిరంజీవులు ,దానేటి రాజారావు,ఆద్వర్యంలో ఈ కార్యక్రమం జరిపారు.యువనాయుకులు రెడ్డి శివన్నారాయణ,ఇలపండ వేణుగోపాలరావు కమిటీ సభ్యులు పాల్గోన్నారు,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here