అమ్మ దేవాలయం
అమ్మలేనిదే ఈ సృష్టిలేదు…అమ్మ ప్రేమ ముందు ..అభిమానం ముందు ఏవీ కనబడవు,అమ్మను మించిన దైవంలేదు..దైవానికి మించినది అమ్మ,మనిషికి బాధ కలిగినా …సంతోషం కలిగినా తొలిపలికేది అమ్మమాట…కంటికి రెప్పలా…అనుక్షణం ప్రతిక్షణం నిద్రలేని రాత్రులు గడిపి జీవితాన్ని ప్రసాదించేది అమ్మ.ఈ సృష్టిలో అమ్మలేనిదే నీవు లేవు,అమ్మలేనిదే నీకు జీవనం లేదు..జీవితం లేదు…అటువంటి అమ్మజ్ఞాపకాలు మదిలో తలుచుకుంటూ,అమ్మ పడే ఆరాటం కళ్లముందు కన్పించే మధుర ఘట్టాలు …ప్రతికోడుక్కిదక్కుతుంది.స్వార్ధం కోసం తన పల్లలు బాగుండాలని,ఉన్నత స్దాయిలో చూడాలని కలలు కన్న ఆ తల్లి తపన వర్ణాతీతం.గుడులు ,బడులు ఎన్నోవున్నాయి.సృష్టిని నడిపే బ్రహ్మాకు గుడిలేదు…జన్మనిచ్చిన తల్లికి కూడా గుడిలేదు..అయినా ఆ కన్నకొడుకు అమ్మకోసం గుడి నిర్మాణం చేయుడం అద్బుతం. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం చీమలవలస గ్రామంలో కన్నకొడుకు తన తల్లికోసం ఏకంగా 10కోట్లు తో అద్బుత శిలా రూపాలుతో గుడి నిర్మించడం విశేషం. సనపల శ్రావణ్‌కుమార్ తల్లి సనపల అనసూయదేవి 2008లో కుటుంబాన్ని వదిలి వెల్లి పోయింది.అప్పటినుండి ఆ కుటుంబంలో వెలుగు లేకుండా పోయింది.అప్పటినుండి తన తల్లి ని మదిలో తలుచుకుంటూ బాధపడని రోజులేదు.అనుక్షణం …ప్రతిక్షణం తన తల్లి కోసం,ఈ సృష్టిలో అమ్మకోసం ఏదో చేయాలని ఆలోచనలో కాలం గడిపాడు.తన తల్లిలా ఎంతో మంది పిల్లలకు తల్లిలేని లోటు వుంటునే వుంటుంది.అందువల్ల తల్లి జ్ఞాపకాలు పదిలంగా వుండాలంటే గుడిలో అమ్మను చూసుకోవాలని ఆలోచన తోచింది.అంతే అమ్మదేవాలయం కట్టాలని నిర్ణయించుకున్నాడు శ్రావణ్‌కుమార్.దేవాలయాన్ని క్రిష్ణశిలతో యాదగిరి స్దపతి ప్రాచీన పద్దతిలో అద్బుతంగా నిర్మించాలని దేవాలయం పనులు ప్రారంభించారు.గండు సున్నం,కొబ్బరిపీచు,తుమ్మబంక,కరక్కాయ,బెల్లం,జనపనార,రాతిబందనం ద్వారా దేవాలయం నిర్మాణం జరుగుతుంది.పంచగోపురాలు నిర్మానం చేపడుతున్నారు. ఇపుడున్నదేవాయలంలో ఉత్తర దక్షిణ దిక్కులుకు వున్నాయి,అయితే ఈ దేవాయలం లో అన్ని దిక్కులుకు మార్గాలువున్నట్లు తయారుచేస్తున్నారు.అద్బుత శిలా శిల్పాలు,51అడుగులు ఎత్తులో ఈ దేవాలయం నిర్మానం చేపడుతున్నారు.ఇంత అద్బుత దేవాలయం అమ్మకోసం నిర్మించడం ప్రపంచంలోనే ఓ అద్బుత ఘట్టం …