అయ్యప్పదీక్షలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని నాగావళి నదీతీరంలో వెలిసిన ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ అయ్యప్పదేవాలయంలో సామూహక అయ్యప్పదీక్షలు ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రదాన అర్చకులు దేవరకొండ శంకరనారాయణ శర్మ ఆద్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్బంగా స్వామివారికి క్షీరాబిషేకం,పంచామృతాబిషేకం,ప్రత్యేక పూజలు జరిపారు.ఈ సందర్బంగా ప్రదాన అర్చకులు మాట్లాడుతూ ఈదేవాయంలో 41రోజులు కఠోర దీక్షలు నిర్వహించడం జరుగుతుందని ,ఆలయంలో స్వామివారికి దర్శించుకుంటే సకల శుభాలు నవగ్రహాదోషాలు నివారణ జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తులు పాల్గోన్నారు.