అయ్యప్ప ఉత్సవవిగ్రహమహుత్సావాలు
శ్రీకాకుళం జిల్లా గార మండలం దీపావళిలో వున్న శ్రీదర్మశాస్త్రాదేవాలయంలో హరిహరసుతుడైన అయ్యప్పస్వామివారి ఉత్సవమూర్తిలు ప్రతిష్టామహుత్సావాలు ఘనంగా నిర్వహించారు.ముందుగా ఆలయంలో విఘ్నేశ్వరపూజ పుణ్యాహవచనం,ఆగ్నిప్రతిష్ట మహుత్సావాలు ఘనంగా జరిపారు.మహిళలు కలిశాలతో ఊరేగింపుగా వేదపండితులు వేదమంత్రోచ్చరణలు నడుమ శాస్త్రాయుక్తంగా ఉత్సవం జరిపారు. చిన్మయమిషన్ పరాత్మానందస్వామిజీ బాలా త్రిపుర కాలభైరవ ఉపాసకులు గణేశ్ గురూజీ ఆద్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.గోవిందనామ ప్రసార సాధన సమితి మధుసూదన స్వామిజీ ఆద్వర్యంలో తిరువీది మహుత్సావాలు జరిపారు.ఈ కార్యక్రమానికి వివిద ప్రాంతాలునుండి అదిక సంఖ్యలో భక్తులు పాల్గోని స్వామివారి ఉత్సవాలలో పాల్గోన్నారు.