అవాస్తవ ఆరోపణలు సరికాదు
శ్రీకాకుళం: ప్రభుత్వం నిర్ధేశించిన విధివిదానాలుకు అనుగుణంగా,లక్ష్యాన్ని చేరుకునేందుకు రిజస్ట్రేషన్లు ప్రక్రియ వేగవంతం చేశామని శ్రీకాకుళం జిల్లా పలాస సబ్ రిజస్ట్రార్ తవిటయ్య అన్నారు.కొంత మంది వ్యక్తులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో అవాస్తవ ఆరోపణలు వస్తున్నాయని,ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిజస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా సాగుతుందని అమ్మకం,కొనుగోలు దారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు.తన వ్యక్తి గత ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ఒక చిన్నపత్రిక పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తుందని వాస్తవాలు తెలియుకుండా వార్త ప్రచురితం చేస్తున్నారని తెలిపారు.అసలు డాక్యుమొంటు రైటర్లుకు సబ్‌రిజస్ట్రార్‌కు సంబందం లేదని కొనుగోలు అమ్మకాలు జరిపిన వారు డాక్యుమొంటు రైటర్లు వద్ద డాక్యుమొంట్లు తయారు చేసుకుని సక్రమంగా వున్నాయో లేదో తెలుసుకున్న వరకే వారి పని అని వారు కార్యాలయాలంలోకి కూడా అనుమతించడం లేదని తెలిపారు.అదికార పార్టీ నాయుకులుకు కొమ్ముకాస్తున్నానని , తప్పుడు ప్రకటనలు గుప్పిస్తున్నారని,డాక్యుమొంటు సక్రమంగా వుంటే ఎవరికైనా రిజస్ట్రేషన్ వేగవంతంగా జరుగుతుందని అన్నారు.ప్రజలు ఇటువంటి తప్పుడు సమాచారం నమ్మవద్దుని దీనిపై ఉన్నతాదికారులకు నివేదిక అందచేస్తానని అన్నారు.