అవినీతి ఐసిడిఎస్ సూపర్‌వైజర్ రంగుల రాట్నం
రణస్దలంలో ప్రాజెక్టు పరిదిలో బియ్యం గోల్‌మాల్ లో సస్పెండైన అదికారి
చేసేవి అవినీతి లీలలు…మాట్లాడేవి శ్రీరంగనీతులు..
శ్రీకాకుళం : చిన్నారులుకు …గర్బిణీలు,బాలింతలుకు పౌష్టికాహారం అందించాలని ప్రతిష్టాకరంగా పధకాలు అమలుచేస్తున్నారు.అయితే కొంతమంది అవినీతి చీడపురుగులు తయారై ఐసిడియస్ వ్యవస్దను బ్రష్టుపట్టిస్తున్నారు.రణస్దలంలో బియ్యం అక్రమంగా తరలించి అడ్డంగాదొరికిపోయినా సూపర్ వైజర్ లీలారాణి సస్పెండై కొంతకాలం గాలిలో వున్న వ్యవహారతీరు మారలేదు.ఇపుడు ఆముదాలవలస ప్రాజెక్టులో సరుబుజ్జిలి సెక్టారులో సూపర్‌వైజరుగా జాయిన్ అయి రెండు నెలలు కాలేదు.అప్పుడే కేంద్రాలలో విజిట్ చేసి కార్యకర్తలు కు తపుదోవపట్టించి వారిని బెదిరిస్తూ తన స్వంత విలేకరిని కారులో తిప్పుతూ వార్తలు రాయంచడం చేస్తుంది.దీనితో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.అంతేకాకుండా ప్రయివేటు కారు డ్రైవర్లును అంగన్వాడీ కేంద్రాలో తనిఖీలు నిర్వహించమని చెబుతుంది.గడప గడపకు వైయస్సార్ కార్యక్రమంలో స్పీకరు తమ్మినేని శీతారాం పర్యటిస్తుంటే కార్యకర్తలు ఫోన్‌చేసి మీరు వస్తారా అని అడిగితే స్పీకరు పర్యటనకు అంతఅవసరం నాకు లేదని చెప్పడం ఆశ్యర్యానికి గురిచేసింది.ఇటువంటి భాద్యతా రాహిత్యమైన సూపర్‌వైజర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్దానిక నాయుకులు తమ్మినేని కి వివరించినట్లుగా తెలుస్తుంది.తను తప్పుడు వార్తలుచేయుస్తూ క్రియెటివ్‌గా చీరలు మారుస్తూ …రంగుల రాట్నం ప్రదర్శస్తుంది.ఇలాంటి అవినీతి అదికారిపై ,పై అదికార్లు చర్యలు ఎలావుంటాయో వేచి చూడాలి…