ఆన్‌లైన్ మోసాలు పై ప్రజలు అప్రమత్తంగావుండాలి
శ్రీకాకుళం: ఆన్‌లైన్ మోసాలు పై ప్రజలు అప్రమత్తంగావుండాలని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఇచ్చాపురం సిఐ ఆర్ ఈశ్వర్ చంద్రప్రసాద్ అన్నారు.ఈ మద్యకాలంలో ఆన్‌లైన్‌మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్దానిక తిప్పన సుజాతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుమేరకు న్యూడిల్లీకి చెందిన కులవత్‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని ఇటువంటి మోసాలు ఎక్కువగా నైజీరియాకు చెందిన వారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.కులవత్‌సింగ్ ఎకౌంటు స్వాదీనం చేసుకున్నామని మాసిబ్బందితో డిల్లీ వెళ్లి వీరిని తమ కస్టడీలోకి తీసుకున్నామని తెలిపారు.ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగావుండాలని ఆన్‌లైన్ మోసాలు పై అవగాహన పొందాలని ఎవరూ మోసపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐతోపాటు ఎస్‌ఐ కె.గోవిందరావు తదితరులు పాల్గోన్నారు.