ఆరునెలలలో అమరావతి పనులు పూర్తిచేయాలి`హైకోర్టు
అమరావతి: సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్రప్రభుత్వం వ్యవహరించాలనిఆరునెలలలో అమరావతి పనులు పూర్తిచేయాలని హైకోర్టు తెలిపింది.మూడు రాజధానిలు సీఆర్డీఏ రద్దు పిటిషన్లుపై హైకోర్టు తీర్పు చెప్పింది.ఒప్పందం ప్రకారం ఆరునెలలో పనులు పూర్తిచేయాలనిభూములు ఇచ్చే రైతులకు 3నెలలలో అన్ని సౌకర్యాలు తో అభివృద్ది పరిచిన ప్లాటులను అప్పగించాలని తెలిపింది.అభివృద్ది పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని,రాజధాని అవసరాలుకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని హైకోర్టు తెలిపింది.