ఆర్దిక శాఖ ఉన్నతాదికారులతో ముఖ్యమంత్రి సమావేశం
అమరావతి: ఆర్దిక శాఖ ఉన్నతాదికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహనరెడ్డి సమావేశమయ్యారు.రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ,పై కమిటీ ఇచ్చిన నివేదిక పై చర్చించనున్నారు.ఉద్యోగుల సమస్యలు,సిపిఎస్ రద్దు,కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ,తదితర డిమాండ్లు పై చర్చించనున్నారు.ఈనెల 3న తిరుపతిలో ఉద్యోగులకు 10రోజులలో పీఆర్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన నేపద్యంలో ఈ సమావేశం ప్రాదాన్యత సంతరించుకుంది.అలాగే గ్రామవార్డు సచివాలయాలు ఉద్యోగులు ప్రోహిబిషన్ ఖరారుపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం వుంది.