ఇంటరు విద్యతో పాటు డిఫెన్సులో ఆఫీసర్ ఉద్యోగాలు
ఇండియన్ ఆర్మీ కాలింగ్ డైరెక్టరు బివి.రమణ
శ్రీకాకుళం: భారత రక్షణ రంగంలో ఆఫీసర్ క్యాడర్‌లో మన తెలుగువారు శాతం చాలా తక్కువగా వుందని ఆధికార హోదాపై సరైన అవగాహన లేకపోవడంవల్ల ఆఫీసర్ ఉద్యోగాలు పొందలేకపోతున్నామని ఇండియన్‌ఆర్మీ కాలింగ్ డైరెక్టరు బి.వి రమణ అన్నారు.శుక్రువారం శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ కార్యాలయంలలో విలేకర్లు సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో తెలుగు యువత యుపీఎసీఎస్,ఎన్‌డిఏ ఆఫీసర్సు,టిఇఎస్,సీడీఎస్ ఆఫీసర్లు ఉద్యోగాలు పొందేందుకు సరైన అవగాహనకల్పించి ఉద్యోగ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ యేడాదినుండి టెన్త్ అర్హతతో పాటు ప్లస్ `2 తో డిఫెన్సు కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలిపారు.ఈ కోర్సులు పూర్తిస్దాయిలో సైనిక శిక్షణ విదంగానే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఇంటర్ విద్యతో ఆర్మీ,నేవీ,ఎయిర్‌ఫోర్సు,పారామిలటరీ వంటి రంగాలలో ఆఫీసర్ స్దాయిలో ఉద్యోగాలు పొందేందుకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఉత్తరాంద్రనుంచి వివిద కేటగిరిలలో 30వేలు మంది ఆర్మీ,నేవీ,ఎయిర్‌ఫోర్సులో వున్నారని తెలిపారు.ఈ శిక్షణకొరకు ఈనెల 25నుండి రిజస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని 100రూపాయిలు రుసుం చెల్లించి ఇండియన్ ఆర్మీ కాలింగ్ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని ఈ అకాడమీ ఆద్వర్యంలో నిర్వహించే పరిక్షలలో ఆదిక మార్కులు వచ్చిన వారికి ఇండియన్ ఆర్మీకాలింగ్ సెంటరు ద్వారా ఇంటర్ విద్యతో పాటు రెండేళ్ల ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఇతర వివరాలకు 6281284246,8712704951నెంబర్లుకు సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ గోవిందరావు,రెండో ఇన్‌చార్జు సురేంద్ర,ఎఓ శంకరరావు తదితరులు పాల్గోన్నారు.