ఇండియా కూటమి తొలి భేటీ
న్యూడిల్లీ: కేంద్రంలో అధికార పార్టీ ఎన్‌డిఏ పై ఉమ్మడి పోరుకు సిద్దమైన ఇండియన్ నేషనల్ డెవలప్‌మొంటు ఇన్‌క్లూజివ్ అలియెన్సు పేరును ప్రకటించాయి.ఈ క్రమంలో గురువారం ఈ పార్టీలు అన్ని తొలి సమావేశం నిర్వహించనున్నారు.పార్లమొంటు లో అనుసరించవలసిన వ్యూహాలు చర్చించనున్నాయి.పార్లమొంటు వర్షాకాల సమావేశాలు జులై 20నుండి ఆగస్టు 11వరకూ జరగనున్నాయి.ఇండియా కూటమికి 150మంది సభ్యులు వుండగా ఎన్డీయేకు 330 మంది సభ్యులు వున్నారు.ఈ యేడాది కొన్ని రాష్ట్రాలుఎన్నికలు,వచ్చే యాడాది సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండడంతో ఈ సమావేశాలకు ఆసక్తి గా మారనుంది.