ఇందకీలాద్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
విజయవాడ: నవరాత్రులు పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి సర్వాంగసుందరంగా ముస్తాబైంది.వివిద ప్రాంతాలునుండి భక్తులు అదిక సంఖ్యలో పాల్గోంటున్నారు కాబట్టి భక్తులుకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటుచేసినట్లు నగర పోలీసు కమీషనర్ కాంతిరాణాటాటా అన్నారు.పోలీసు యంత్రాంగానికి ముందుస్తు ఏర్పాటుచేసేందుకు సమావేశం ఏర్పాటుచేశారు.ఈ సమావేశంలో పోలీసులకు వారి విధులు నిర్వహించే విదానం కోసం అవగాహన కల్పించారు.ఎటువంటి పరిస్దితులలోనూ ఎవరుకు కేటాయించిన ప్రదేశాలలో వారే విధులు నిర్వహించాలని తెలిపారు.అంతేకాకుండా మూడు షిష్టులు ఏర్పాటుచేయుడం ద్వారా ఏటువంటి ఇబ్బందులు భక్తులుకు కలగకుండా చూడాలని పోలీసు యంర్రతాంగానికి సూచించారు.ఆలయ సిబ్బందితో గాని ఇతర శాఖలు సిబ్బందితో గాని విఐపిలుతో గాని ఎటువంటి తగాదాలుకు తోవలేకుండా సమన్వయంతో పనిచేయాలని అమ్మవారు దర్శనం సజావుగా సాగేందకు అందరం కృషిచేయాలని అన్నారు.