ఇచ్చాపురం రూరల్ ఎస్‌ఐగా రమేష్ బాధ్యతలు స్వీకరణ
శ్రీకాకుళం: పెండిరగ్‌లో వున్న సమస్యలను ,క్రైమ్ రేట్‌ను తగ్గించేందుకు తమ వంతు కృషిచేస్తానని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రూరల్ ఎస్‌ఐ వి.రమేష్ తెలిపారు.శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వహించి జిల్లా ఎస్‌పి ఆదేశాల మేరకు సోమవారం ఇచ్చాపురం రూరల్ ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆంద్రా ఒడిస్సా సరిహద్దు ప్రాంతమైన ఇచ్చాపురంలో అక్రమ రవాణా,మాదక ద్రవ్యాలు రవాణా జరుగుతుందని దాన్ని నియంత్రించించేకు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.పోలీసు స్టేషన్ లో పెండిరగ్‌లో వున్న కేసులు పరిష్కరించేందుకు,ప్రజలుతో మమేకమై సమస్యలు ఎప్పటికపుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిబ్బందితో మాట్లాడారు