ఎంపీ ఇంట్లో పాము కలకలం
శ్రీకాకుళం: శ్రీకాకుళం పార్లమొంటు సభ్యులు కింజరాపు రామ్మోహననాయుడు ఇంట్లో ఈ రోజు పాము కలకలం రేపింది.అత్యంత విషపూరితమైన రక్తపింజరం ఇంట్లో చొరబడి బుసలు కొడుతుంటే సిబ్బంది హడలిపోయారు.వెంటనే గ్రీన్‌మోర్సుస్నేక్ హెల్పులైన్‌కు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని పామును బందించారు.రేంజ్‌ఆఫీసర్ గోపాలనాయుడు సూచన మేరకు పామును సమీపంలోని రేంజ్ ఫారెస్టుప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టినట్లు గ్రీన్‌మెర్సీ సిఇవో కె.వి.రమణమూర్తి తెలిపారు.