ఎన్ ఇ ఆర్ స్కూలు ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్వెస్టిచూర్ సెరిమోని
రణస్దలం: మధ్యతరగతికి అందుబాటులో నాణ్యమైన విద్యను అందించి ఉత్తరాంద్రలోనే మంచి పేరు సంపాదించిన ఎన్‌ఇఆర్ స్కూలు ఆఫ్ ఎక్స్లెన్స్ ఆందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ఎచ్చెర్ల శాసనసభ్యులు గొర్లె కిరణ్‌కుమార్ తెలిపారు.శనివారం ఎన్‌ఇ ఆర్ స్కూలు ఆఫ్ ఎక్స్లెన్స్ స్కూలు కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉత్తరాంద్రాకు తలమానికంగా మన రణస్దలంలో మద్యతరగతి అందరికీ విద్య అందించండలంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్ ఈశ్వరరావుకు అబినందించాలని ,అన్నారు.పేద మద్యతరగతి కుటుంబాలు కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి గా అందరి మన్ననలు అందుకుంటున్నారని,కార్పోరేటు విద్య మద్యతరగతి పిల్లలకు అందించడం అంతసులువుకాదని అది ఎన్‌ఇఆర్ నిరూపించారని అన్నారు.ఈ సందర్బంగా స్కూలు చైర్మన్ ఎన్.ఈశ్వరరావు మాట్లాడుతూ స్కూలు విద్యార్దులు ర్యాంకులు మార్కులు అనే లక్ష్యంతో స్దాపించినది కాదని,విద్యార్దులు జీవితాలలో ఎదురయ్యే సవాళ్లు అదిగమించేందుకు ఏవిదంగా తీర్చిదిద్దాలని ఆలోచించి నెలకొల్పానని అన్నారు.విద్యార్దులే స్కూలు నడిపే విదంగా నాయకత్వలక్షణాలు పెంపోందించేందుకు స్టూడెంటు కౌన్సిల్ ఏర్పాటుచేయుడం జరిగిందని ఇది విదేశాలలో మాత్రమే ఇటువంటి ప్రక్రియ వుంటుందని దాన్ని ఇపుడు ఇక్కడ అమలు చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంటు ఎన్.తేజ,పలువురు పాల్గోన్నారు.