ఎపి సేవ పేరుతో పోర్టల్ ప్రారంబించిన సిఎం
అమరావతి: ఇంటిగడప దగ్గరకే పధకాలు అందించేందుకు ఈ సేవలు మరింత మెరుగుగా అందించేందుకు గ్రామ,వార్డు సచివాలయాలు మరింత వేగవంతంగా సేవలు అందించేందుకు రాష్ట్రముఖ్యమంత్రి వైయస్ జగన్మోహనరెడ్డి ఎపి సేవ పేరుతో పోర్టల్ ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ వేర్వేరు శాఖాలన్నీ ఓకే పోర్టల్ కిందకు తీసుకువచ్చి మారుమూల ప్రాంతాలు లో కూడా పారదర్శకత,జవాబుదారీ తనం పెంచగలుగుతామని అన్నారు.ఎవరకీ లంచాలు ఇవ్వవలసిన అవసరం లేదని ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా సమాచారం అందించడం జరుగుతుందని రెండన్నరేళ్లలో 3.46కోట్ల మందికి సేవలు అందించామని అన్నారు.