ఎపీలో భారీ గా పెరుగుతున్న కరోనా కేసులు
అమరావతి: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.రోజువారీ కేసులు పెరగడంతో కాసింత ఆందోళన కలిగిస్తుంది.రాష్ట్రంలో గడిచిన 24గంటలలో 32వేల 784 కరోనా పరిక్షలు నిర్వహించగా 434మంది కోవిడ్ నిర్ధారణ అయ్యింది.గత నెలరోజులలో ఇదే ఎక్కువ.ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఆరోగ్యశాఖను అలెల్టు చేసింది.ప్రజలు ప్రయాణాలు తగ్గించుకోవాలని ,సామాజిక దూరం,మాస్కులు విడిగా వాడాలని సూచించినా ప్రజలు పట్టించుకోకపోవడం,పండగరోజు కావడం కోవిడ్ వ్యాప్తి జరుగుతుంది.