ఒమిక్రాన్ వైరస్ పై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి దృష్టా కేంద్రం అన్ని రాష్ట్రాలకు అప్రమత్తం చేసింది.ఒమిక్రాన్ వ్యాప్తి చెందిన దేశాలనుండి వచ్చే ప్రయాణికులను నిశితంగా పరిశీలించాలని,కఠినంగా స్కానింగ్ చేయాలని ఆదేశించింది.ఇంటెన్సిన్ కంటైన్మెంటు ,పటిష్టనిఘా,వ్యాక్సినేషన్ అమలు పై కేంద్రం దృష్టి సారించింది.కోవిడ్`19పరిక్షలు పెంచాలని ,కోన్ని రాష్ట్రాలలో ఆర్టీపిసీ పరిక్షలు సంఖ్యతగ్గినట్టుగుర్తించామని,హాట్‌స్పాట్ గుర్తించి నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కేంద్రం సూచించింది.పాజిటివ్ రేటు 5శాతం కంటే ఎక్కువ వున్న ప్రాంతాలను దృష్టిసారించాలని తగినంత వైద్య సదుపాయాలు ఏర్పాటుచేయాలని సూచింది.కేంద్రం అందచేసిన నిధులు సమర్దవంతంగా వైద్యసదుపాయాలు కల్పన కోసం వినియెగించాలని తెలిపింది.తప్పుడు సమాచారం తో ప్రజలుకు భయాందోళన కలిగించకుండా ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించాలని తెలిపింది.ఓమిక్రాన్ వైరస్ ప్రన్తుతం బ్రిటన్,జర్మనీ,ఇటలీ,బెల్జియం,అస్త్రియా,బోట్సువానా,ఇజ్రాయిల్, హాంగకాంగ్ దేశాలలో గుర్తించారని అందువల్ల ప్రజలుకు అప్రమత్తం చేయాలని కేంద్రం సూచించింది.