ఓ రేంజ్‌లో అమ్ముడుపోయిన భీమ్లా నాయక్ ఓటీటీ రైట్సు
పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌చేసిన భీమ్లానాయక్ మూవీ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యదిక దియేటర్లులో విడుదలయ్యేందుకు సిద్దమవుతుంది.హిందీలో ఏకకాలంలో రిలీజ్ అవుతున్న ఈ సనిమాలో పోలీస్ ఇన్‌స్పెక్టరుగా భీమ్లానాయక్‌తో గొడవపడే మాజీ హవల్దార్ డానీయల్ శేఖర్‌గా రానా దగ్గుబాటి కనిపంచడంతో ఈ సినిమా మరింత రసవత్తరంగామారింది.పవన్‌కళ్యాణ్ భార్యగా నిత్యామీనన్,రానా భార్యగా సంయుక్త మీనన్ నటించారు.తాజా సమాచారం ప్రకారంభీమ్లానాయక్ ఓటీటీ హక్కులు కూడా అనూహ్య స్దాయిలో అమ్ముడవుతున్నాయని టాక్ నడుస్తుంది.ధియేటర్లులో విడుదలయినతరువాత మూడు నాలుగు వారాలు తరువాత ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నది.