కరోనా భయం
దేశంలో మళ్లీ కరోనా భయం మొదలైంది.బీహారులో నలుగురు ఎన్నారైలు కు పాజటివ్‌రావడంతో కలకలం రేగింది.అంతేకాకుండా ఈనెల 29నుండి 3రోజులు పాటు గయలో దలైలామా కార్యక్రమాలు వుండడంతో ప్రభుత్వంలో టెన్షన్ మొదలైంది.దలైలామా కార్యక్రమానకి విదేశీయులు ఎక్కువగా రావడంతో ఏం ప్రమాదం వుంటుందోని ఆందోళన చెందుతున్నారు.
గయ ఎయిర్‌పోర్టులో ముమ్మరంగా కరోనా టెస్టులు చేయుడం జరుగుతుంది.పాజిటివ్ వచ్చిన నలుగురును ఐసోలేషన్‌లో వుంచామని అదికార్లు తెలిపారు.
చైనా నుండి యుపికి వచ్చిన వ్యక్తికి కూడా కరోనా రావడంతో అదికార్లు అప్రమత్తమయ్యారు.వేరియంట్ నిర్దారణకు జినోమ్ సీక్కెన్సింగ్ శాంపిల్సు తీసుకున్నారు.అత్యవసరంగా ఈ రోజు సాయంత్రం ఇండియన్ మెడికల్ అసోషియేషన్ తో కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి వీడియో కాన్ఫురెన్సు నిర్వహించనున్నారు.రేపు కరోనా డ్రైవ్ నిర్వహణ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
దేశంలో ఇప్పటివరకూ 24గంటలలో 196కేసులు నమోదైనట్లు సమాచారం