కుక్కలు దాడిలో మరో బాలుడు మృతి
ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా రఘనాధపాలెం మండలం పుటనీతండాలో కుక్కలు దాడిలో మరో బాలుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది.తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి సంఘటన జరగడం ఇది రెండో సారి కావడంతో ప్రజలు భయం చెందుతున్నారు.నిన్నసాయంత్రం ఇంటిముందు అడుకుంటున్న పిల్లాడుపై కుక్కలుదాడి జరిగింది.ఈ దాడిలో భరత్ అనే విద్యార్ది చెనిపోయాడు.తీవ్రగాయాలుఅయిన భరత్‌ను హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందడంతో హృదయ విదారక సంఘనచోటుచేసుకుంది.ఇప్పటికైనా వీదికుక్కలు భారినుండి కాపాడుకునేందుకు ప్రభుత్వం కుక్కలునియంత్రణ చేయాలని ప్రజలుకోరుతున్నారు.