కుటుంబ పాలన వల్ల అవినీతి`ప్రదానిమంత్రి నరేంద్రమోదీ
హైదరాబాద్: తెలంగాణలో కుటుంబ పాలన వల్ల అభివృద్ది కుంటు పడిరదని ,కుటుంబ పాలన రాజ్యమేలుతుందని ప్రదానిమంత్రి నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్రంతో పొత్తు లేకుండా స్వయనిర్ణయాలు వల్ల రాష్ట్రం నష్టపోతుందన్నారు.పరేడ్ గ్రౌండ్‌మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సమావేశంలో ప్రదాని మాట్లాడారు.తెలంగాణకు 11వేలు కోట్లు రూపాయిలు అభివృద్ది పనులుకు కేంద్రం ఇవ్వడం జరిగిందని ఒకప్పుడు వున్న2500కిలోమీటర్లు నేషనల్ హైవే ఇపుడు 5000కిలోమీటర్లుకు విస్తరించామని అన్నారు.35000కోట్లు రూపాయిలు రోడ్లు కు ఖర్చుచేశామన్నారు.హైదరాబాద్ రింగురోడ్లు ప్రాజెక్టు కూడా అమల్లో వుందన్నారు.దేశవ్యాప్తంగా 7మోగా టెక్స్‌టైల్సు పార్కులు ఏర్పాటుచేయునున్నామని అందులో తెలంగాణ రాష్ట్రం వుందన్నారు.విద్యపై పెట్టుబడులు పెంచుతున్నామన్నారు.యువతకు ఉపాది అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్దం చేశామన్నారు.