కొత్త జిల్లాలతో పాలనలో మరింత ముందడుగు
– డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
ఉగాది నుంచి మొదలవుతున్న కొత్త జిల్లాలతో మరింత సమర్థవంతమైన పాలన ప్రజలకు అందనుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజలకు ఇంతకు ముందు సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ఏం చెప్పారో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అన్ని ప్రాంతాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రజల నుంచే అభ్యంతరాల స్వీకరణ గురువారం ఆఖరి రోజని ఇప్పటివరకు 7500 పైగా ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు అందాయని వివరించారు. వీటిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందు ఉంచి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొత్త జిల్లాల పాలనకు అధికారుల బదలాయింపు కూడా జరుగుతోందని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలు, అభివృద్ధి పనుల నిర్వహణ మరింత సులభతరం కానుందని తెలిపారు. ప్రజలకు అన్ని వేళల్లోనూ ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని తెలిపారు.