కొత్త వేరియంట్ ఒమిక్రాన్
న్యూడిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వాప్తి,దాని ప్రభావం పై ప్రదానమంత్రి నరేంద్ర మెదీ కీలక సమావేశం నిర్వహించారు.దేశంలో వ్యాక్సిన్ అమలు తీరు ఉన్నతాదికారులతో సమావేశమయ్యారు.దక్షిణాప్రికా లో బయటపడ్డ ఒమిక్రాన్‌వేరియంట్ ఇప్పటకి పొరుగుదేశాలకు వ్యాపించడంతో కోవిడ్ టీకాలు రెండు డోసులు తీసుకున్నవారికి కూడా ఈ వైరస్ సోకుతుండడంతో ప్రపంచదేశాలు కలవరు పడుతున్నాయి.అదిక మ్యూటేషన్లు కారణంగా డెల్టాకంటే ఇది ప్రమాదికారిగా భావిస్తున్నారు.వేగంగా వ్యాపించి తీవ్రలక్షణాలు కన్పించడంతో నిపుణులు ఆందోళన చెందుతున్నారు.మరోవైపు కొత్త వేరియంట్ నేపద్యంలో ఇప్పటికే పలు దేశాలు ఆఫ్రికా దేశాలు నుండి విమానాలు రాకపోకలు నిషేదాజ్ఞలు జారీచేశారు.భారత్ కూడా ఆదేశాలునుండి వచ్చే విమానాలు నిలుపుదల చేయాలని ఇప్పటికే డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రదాని మంత్రి ని విజ్ఞప్తి చేశారు.