కోవిడ్ పరిస్దితులుపై కేంద్ర ఆరోగ్యశాఖ సమిక్షాసమావేశం
న్యూడిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో అన్ని రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాలు ఆరోగ్యశాఖాదికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ సమిక్షాసమావేశం నిర్వహించారు.కోవిడ్ సంసిద్దత పై కేంద్ర ఆరోగ్యశాఖా కార్యదర్శి రాజేశ్‌భూషణ్ చర్చించారు.కోవిడ్`19క్లినికల్ చికిత్సలో ఉపయెగించి8డ్రగ్సు బఫర్ స్టాక్ ఉండేలా చూసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.కేసులు పెరిగితే పరిస్దితులును ఎదుర్కొనేందుకు ఆసుపత్రులు సిద్దంగా వుండాలని తెలిపారు.కరోనా…కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయని ఈ నేపధ్యంలో ఆస్పత్రులు వెంటిలేటర్లు ,పిఎస్ ఏ ప్లాంట్లు ,ఆక్సిజన్ కాన్పంట్రేటర్లు సిద్దంగా ఉంచుకోవాలని ఆయా రాష్ట్రాలు కు స్పష్టం చేశారు.