గణపతికి గరికపూజ ఎందుకు చేస్తారు..?
గడ్డిపోచను సంస్కృతంలో దూర్వారము అంటారు.ఈ సృష్టిలో గడ్డిపోచకు కూడా విలువుందని నిరూపించడానికి స్వామి పూజకు స్వీకరిస్తాడు.ఈ గరికిపూజలు ఓ చారిత్ర కధనం కూడా వుంది.అనలాసురుడు అనే రాక్షసుడు లోకాలన్నింటిని భయపెట్టేవాడు.దేవతలందరూ గణపతికి వెల్లి మొరపెట్టుకున్నారు. గణపతి అమాంతరంగా అననాసురుడుని మింగేశాడు.అనలం అంటే అగ్ని .అనలాసురుడును మింగగానే వినాయుకుని శరీరమంతా తాపంతో రగిలిపోతుంది.దేవతలు అందరూ ఆయనకు ఉపశమనం కలిగించడం కోసం పద్మాలు,పుష్పాలు,చంద్రున్ని కూడా తీసుకువచ్చారు.ఆయినా ఆయన తాపం తగ్గలేదు.చివరకు పరమశివుడు వచ్చి గరికపోచ తీసుకుని వెంటిలా చూట్టూ గణపతి శిరస్సుపై వుంచాడు.ఆ వుంచడం వల్ల వినాయుకుడు చల్లబడ్డాడు.అందువల్ల వినాయుకుని పూజకు గరికపోచ పెడతారు.గరికతో పూజ చేస్తారు.ఇది సాక్షాత్తు శివుని అనుగ్రహంగా శాస్త్రాలు చెబుతున్నాయి.