గాంధీ మందిరం `స్వాతంత్య్రసమరయోధుల స్ఫూర్తి వనం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాతో మహాత్మాగాంధీ గారి అనుబందం…ఆయన ఉద్యమ బాట,మహాత్మునిగా ఆయన దేశానికి అందించిన సందేశం…సత్యం,ధర్మం,శాంతి,అహింసా మార్గం…భావి తరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో శ్రీకాకుళం జిల్లాలో గాంధీమందిరం…స్వాతంత్య్రసమరయోధుల స్ఫూర్తి వనం పేరుతో గాంధీ మందిరం నిర్మించారు.శ్రీకాకుళం పట్టణంలో అత్యంత సర్వాంగ సుందరంగా,కల్లుకు కట్టినట్టుగా…గాంధీ జీవితం మరియు 25మంది స్వాతంత్య్రయ సమరయోదుల విగ్రహాలతో ఎక్కడా లేని విధంగా తయారు చేస్తున్నారు.మహాన్నత వ్యక్తులు జాతికి అందించే సందేశం ఇక్కడ పొందుపరుస్తున్నారు.అసలు గాందీ మహాత్మునిగా ఎందుకు అయ్యారు,అసలు అతనికి ఉద్యమం ఎందుకు చేయువలసివచ్చింది.అనేది గోడలపై చిత్రీకరిస్తున్నారు.1915లో గాంధీగారు సౌతాఫ్రికా వెల్లినపుడు తెల్లవారు గాంధీని రైలునుండి తోసివేసినపుడు గాంధీకి ఉద్యమం పుట్టింది.ఉద్యమం నుండి మహాత్మునిగా అందరిగుండెలలోనిలిచిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.అంతేకాకుండా గాంధీ శ్రీకాకుళం జిల్లాలో ఐదురోజలుపాటు వున్నారు1927 డిసెంబరు 2,3,4,5,తేదీలలో జిల్లాలో పర్యటించారు1856లో అప్పటి మున్సిపల్ చైర్మన్ శెట్టిపూర్ణయ్యపంతులు గారు గాంధీజీకి సన్మానం కార్యక్రమం కూడా నిర్వహించారు.ఎక్కడ లేని విధంగా ఈ జిల్లాలో గాందీ గారు ఐదురోజలు వుండడం విశేషం.మరోవైపు ఉప్పుసత్యాగ్రహం తెలిపే చిత్రాలు పొందుపరుస్తున్నారు.ఈ గాంధీమందిరం జనవరి 30గాంధీ వర్ధంతి రోజు ప్రారంభిస్తారు.20మంది స్వాతంత్య్రసమరయోధులు,5గురు జాతిని ప్రభావితం చేసే స్పూర్తి ప్రదాతలు విగ్రహాలు ఇక్కడ కొలువుదీరనున్నాయి.ఇటువంటి మందిరాన్నిఒక్కసారైనా వీక్షించక తప్పదు…