గుంటూరులో సిఎం పర్యటన
గుంటూరు : గుంటూరు జిల్లా వెంకటపాలెం,కృష్ణాపాలెంలో పేదల ఇండ్లుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి శంఖుస్దాపన చేశారు.ఈ సందర్బంగా కృష్ణాయపాలెంలో మోడల్ హౌస్‌లను సిఎం పరిశీలించారు.సిఆర్‌డిఏ పరిదిలో పేదల ఇండ్లుకు శ్రీకారం చుట్టూరు.1402ఎకరాలలో 50వేల 793మందికి ఇండ్లు నిర్మాణం చేపట్టనున్నారు.ఈ సందర్బంగా మొక్కలు నాటారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర చరిత్రలో నే ప్రత్యేకంగా నిలిచిపోతుందని,పేదల విజయంగా ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు.కొంతమంది వ్యక్తులు పేదవాడికి ఇల్లు రావొద్దుని కుట్రలు పనుతున్నారని,ఇల్లు కట్టడానికి వీల్లేదని అంటున్నారని అన్నారు.
పేదలు వ్యతిరేకులు హైకోర్టులో 18కేసులు వేశారని ,మూడేళ్లపాటు కేసులపై పోరాటం చేశామన్నారు.చివరికి దేవుడు ఆశీస్సులతో కేసులు గెలిచామని అన్నారు.