గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవగాహన కార్యక్రమం
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా ,ఫోక్సు చట్టాలు అమలులోకి తీసుకువచ్చినా లైంగిక దాడులు నియంత్రణ జరగడం లేదని అందువల్ల చిన్నతనంనుండే చిన్నారులుకు ఏది మంచి,ఏది చెడు అనే విషయం అవగాహన తీసుకురావాలనేఉద్దేశ్యంతో అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జాయ్‌కిడ్ స్కూలు కరస్పాడెంట్ స్రవంతి తెలిపారు.బుదవారం జాయ్‌కిడ్ స్కూలు ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి చిన్నారిపై తల్లిదండ్రులు శ్రద్ద కనబరచాలని,వారికి అవగాహన కల్పించాలని ,వారికి స్వేచ్చ కల్పించాలని తెలిపారు.ఏది మంచి ఏది చెడు అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో నిర్వహించాలని తెలిపారు.