గుమ్మాలకు మామిడి తోరణాలు ఎందుకు కడతారు..?
భక్తి సమాచారం: ఇంటికి గుమ్మాలకు తోరణాలు కట్టకుండా ఏ శుభకార్యం జరగదు.అలాగని ఒక్క మామిడి తోరణాలు ఎందుకు కడతారు అనేది తెలుసుకోవాలి.ముందుగా శుభకార్యాలుకు రావి,జువ్వి,మర్రి,ఉత్తరేణి,ఆకులను ఉపయెగిస్తారు.తోరణాలు మాత్రం మామిడి తోరణాలు కడతారు.పండగవేళలలో ఎక్కువ శ్రమ ,అలసట,వస్తుంది.శుభకార్యాలు చేసేటప్పుడు ఎక్కువ పనివత్తిడి తీరిక లేని పనులు చేస్తుంటారు.అందువల్ల మామిడి ఆకులకు నిద్రలేమి,అలసట,తొలిగించే గుణం వుంది.అందువల్ల అలసటతో ఇంటిలోకి వచ్చిన వారికి మామిడి తోరణాలు కొంత ఉపశమనం ఇస్తాయని శాస్త్రాలుచెబుతున్నాయి.అందువల్ల శుభకార్యాలకు తప్పనిసరిగా గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకుంటారని ఆచారంగా వస్తుంది.