గ్రామమంతా ఏకమైంది. గ్రామదేవత చల్లని చూపు కై అమ్మవారిని కొలిచేందుకు కు ముత్తయిదువులు కలశాలతో ఊరేగింపుగా బయలుదేరారు. చిన్న పెద్ద తేడా లేకుండా అమ్మవారి ఉత్సవాలు జాతరగా జరుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం చీమల వలస గ్రామంలో 70 సంవత్సరాల తర్వాత గ్రామ దేవత ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మూడు రోజులపాటు జరుపుకునే గ్రామ దేవత ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ అనసూయమ్మ దేవి అమ్మ దేవాలయ ఆధ్వర్యంలో, గ్రామ పెద్దలు సంయుక్తంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
కోలాటాలు చెక్క భజనలు సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
గ్రామ సర్పంచ్ సనపల చెల్లంనాయుడు, అమ్మ దేవాలయం నిర్వాహకులు సామాజికవేత్త సనపల శ్రావణ్ కుమార్ , సనపల కృష్ణారావు, గ్రామ పెద్దలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
అంతకుముందు గ్రామమంతా 1001 కలశాలతో అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు.