ఘెర అగ్ని ప్రమాదం ఇద్దరు సజీవ దహనం
ముంబై: ముంబై మహా నగరంలో ఘెర అగ్నిప్రమాదం సంభవించింది.20అంతస్తుల బారీ భవనంలో ఒక్కసారి మంటలు రావడంతో 18వఅంతస్తులోని పలు ప్లాటులు దగ్దమయ్యాయి.ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు.చాలా మందికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.సెంట్రల్ ముంబై లోని టార్డియా ప్రాంతంలోని నివాస భవనంలో ఈ రోజు ఉదయం ఈ సంఘటన జరిగింది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరంచేశారు.ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.