చిమ్మ చీకటి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.. చీకట్లో ఆర్తనాదాలు అంతలోనే పెద్ద శబ్దం… క్షణంలోనే బస్సు బోల్తా పడింది. శ్రీకాకుళం జిల్లానందిగాం మండలం గొల్లవూరు సమీపంలో అర్దరాత్రి దాటిన వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.బెంగాల్ నుంచి బెంగుళూరుకు వలస కూలీలతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి వాగులో పడింది.ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయి.మిగిలిన 17మంది మహిళలు, పిల్లలతో టెక్కలి మండలం నర్సిపురం బిడ్జ్ కిందను రాత్రంతా గడిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీళ్లలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం జిల్లా రిమ్స్ హాస్పిటల్ తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు