చంద్రబాబు అరెస్టు వైకాపా అరాచకాలు పరాకాష్ట
తిరుపతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టు వైకాపా పార్టీ అరాచకాలుకు పరాకాష్ట అని సిపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు.చంద్రబబాబునాయుడు 14సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తికి ఎటువంటి ఆధారాలు లేకుండా పోలీసులు అరెస్టు చేయుడం వైకాపా దుర్మార్గపు పాలనకు నిదర్శనమని అన్నారు.వైకాపా పాలన రెండు రకాలు పాలనగా సాగుతుందని ఒకటి రివర్సుటెండరింగ్,రెండోది రివేంజ్ పాలన అన్నారు.ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టి పరిపాలన సాగిస్తున్నారని కక్ష్యసాధింపు చర్యలు తప్ప పరిపాలన ఏమీ లేదని అన్నారు.