శ్రీకాకుళం: మహిళలలపై సమాజంలో అందరూ గౌరవించాలని,చట్టాలు మహిళలలకు రక్షణగా నిలుస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు.శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్‌లో చిన్నారిచేదోడు కార్యక్రమంలో పాల్గోన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ మహిళలలకు రక్షణ కరువవుతుందని,వారిపై దాడులు జరుగుతున్నాయని,చిన్నతనంనుండే ఆడపల్లలకు సమాజంలో భయం పుడుతుందనిఅందువల్ల అవగాహనతో అందరూ మహిళలలకు రక్షణకు చేయువలసిన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.సమాజంలో వుండే విద్యావేత్తలు,స్వ
చ్చందసంస్దలు ,నిపుణులు అవగాహన కల్పించి చట్టపరమైన చర్యలుపై కూడా అందరికీ తెలిసివిదంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.పోలీసు యంత్రాంగం నిరంతరం మహిళలలు రక్షణకోసం అన్వేషిస్తుందని,ఎవరైనా తప్పుచేస్తే చర్యలు కఠినంగా వుంటాయని అన్నారు.మహిళలు మానసిక ఆలోచనలతో వుంటున్నారని అందువల్ల ఆత్మహత్యలకు ప్రేరేపించడం జరుగుతుందని వాటిని నియంత్రించే విదంగా అందరం చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ సందర్బంగా స్వచ్చంద సేవాసంస్దలు ప్రతినిధులు,
ఆద్యాత్మికవేత్తలు,విద్యావేత్తలకు సత్కరించారు.ఈ కార్యక్రమంలో అదనపుఎస్పీ విఠలేశ్వరరావు,డిఎస్పీ,సిఐలు,ఎస్సైలు పాల్గోన్నారు.