చెడ్డీ గ్యాంగ్ సభ్యులు ముగ్గురు అరెస్టు
విజయవాడ: విజయవాడ ప్రజలుకు భయబ్రాంతులు చేస్తున్న వివిద నేరాలకు పాల్పడిన చెడ్డీగ్యాంగ్ సభ్యులు ముఠాలోని ముగ్గురిని అరెస్టుచేసినట్లు విజయవాడ పోలీస్ కార్యాలయం తెలిపింది.ఈ మద్య కాలంలో శివారు ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించామని ,జైలునుండి విడుదలలైన వ్యక్తులు,అనుమానస్పదంగా తిరుగుతున్నవ్యుక్తులకు ప్రత్యేక నిఘా వుంచడం జరిగిందని తెలిపారు.విజయవాడ పెనమలూరు పోలీస్‌స్టేషన్ పరిదిలోని దొంగతనాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి అప్రమత్తంగా ,క్లూస్ సేకరించిన ఆదారాలుతో వారిని పట్టుకున్నట్లు పోలీసు అదికార్లు తెలిపారు.వీరివద్దనుండి 20వేలు నగదు,32గ్రాములు బంగారం,2.5కేజీల వెండీ స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు