నాలుగేళ్ల కాలంలో కుల ,మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయుడం జరుగుతుందని యువనాయుకులు ధర్మాన రాంమనోహర్ నాయుడు అన్నారు.శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మాం గ్రామంలో జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమంలో గురువారం పాల్గోన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏకకాలంలో సంక్షేమ పధకాలు అమలుచేయుడంలో జగనన్న ప్రభుత్వం ముందుందని ఈవేళ ప్రజలంతా ఈ నాలుగేళ్లకాలంలో ఎంతో సంతోషంగా వున్నారని అన్నారు.రోడ్లు వేస్తేనా అభివృద్దికాదు ,రోడ్లు వేయాలి సంక్షేమం చూడాలని అన్నారు.ఒక వైపు చంద్రబాబునాయుడు ,మరోవైపు పవన్‌కళ్యాణ్ మా పార్టీని నిలువరించేందుకు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారని కాని మేము నమ్ముకున్నది ప్రజలేనని వారికి అందిస్తున్న సంక్షేమ పధకాలే మాకు తోడుంటాయని అన్నారు.మేలు చేసే ప్రభుత్వాలుకు ప్రజలు అండగా నిలవాలని,అందుకే జగనన్న మళ్లీ అదికారంలోకి రావాలని,జగనన్నే మా భవిష్యత్ అని ప్రజలు నమ్మాలని అన్నారు.