జగనన్న సురక్ష పధకం పేదలకు ఒక వరం

0
65
telugu news

జగనన్న సురక్ష పధకం పేదలకు ఒక వరం
శ్రీకాకుళం: రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష పధకం పేద,మధ్యతరగతి కుటుంబాలకు ఒక వరమని రాష్ట్ర రెవెన్యూశాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.శ్రీకాకుళంలో బుదవారం వైయస్‌ఆర్‌ కళ్యాణమండంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గతంలో ప్రజలు రోజులుతరబడి సర్టిఫికేట్‌లు కోసం నిరీక్షించేవారని నేడు ఆ పరిస్దితి లేదని అన్నారు.ఎవరి కీ ఎటువంటి లంచం లేకండా నేరుగా అబ్దిదారడే గ్రామ సచివాలయంకి వెలితే 11రకాలు సర్టిఫికేట్‌లు తక్షణమే అందించడం జరుగుతుందని ఇంతకంటే ప్రజలకు ఇంకేమి కావలని అన్నారు.ప్రజా సంక్షేమమే ద్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలు అవసరాలు తీర్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వమని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here