జగన్‌రెడ్డిది చేతకాని అసమర్ధ ప్రభుత్వం:చంద్రబాబు
తిరుపతి: సిఎం జగన్మోహన్‌రెడ్డిది చేతకాని అసమర్ధ ప్రభుత్వమని టిడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు.అమరావతి పరిరక్షణ సమితి మహాద్యమ సభలో ఆయన మాట్లాడుతూ అమరావతి రైతులు అలుపెరుగని పోరాటం చేశారని,కొనియాడారు.రాజధాని రైతులు ,మహిళలు పోరాటానికి అభినందనలు తెలిపారు.రాజధాని రైతులు పై అక్రమ కేసులు పెడుతున్నారని అమరావతి రాజధాని ఏ ఒక్కరికీ చెందినది కాదని ఇది ఐదుకోట్లు ఆంద్రుల రాజధాని అని అన్నారు.,ప్రజారాజధాని అమరావతిపై మూడు ముక్కలాట ఆడుతున్నారని ఏపికి అమరావతి భ్రహ్మాండమైన ఆర్ధిక వనరులు సృష్టించగలదని చంద్రబాబు తెలిపారు.దూరదృష్టిలోని జగన్‌రెడ్డి అమరావతి పై నిర్లక్ష్యం వహిస్తున్నారని,మండిపడ్డారు.అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలన్నా దే తమ లక్ష్యం అని అన్నారు.