శ్రీకాకుళం: రాష్ట్రంలో జర్నలిస్టులు సంక్షేమానికి ఇతోదికంగా నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డికి ఆంద్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం విజ్ఞప్తి చేసింది.సిఎస్ భాద్యతలు చేపట్టిన జవహర్‌రెడ్డి ని మర్యాదపూర్వకంగా ఎపిజెఎఫ్ రాష్ట్రకార్యదర్శి శాసపు జోగినాయుడు కలుసుకున్నారు.ఈ సందర్బంగా వినతిపత్రం అందించారు.అర్హులైన జర్నలిస్టులందరికీ ఎక్రిడేషన్ కార్డులు అందించాలని,అలాగే సోసైటీలతో పనిలేకుండా జర్నలిస్టులందరకీ ఇండ్లు స్దలాలు మంజూరుచేసేవిదంగా చర్యలు తీసుకోమని జోగినాయుడు కోరారు.డివిజన్ స్దాయిలో డిఆర్‌ఓలు వ్యవస్దను పునరుద్దరించే విదంగా ,చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా 50సంవత్సరాలు దాటిన జర్నలిస్టులందరికీ 3000రూపాయిలు ఫించన్లు ఇపించాలని,ప్రతియేటా ప్రెస్ అకాడమీ తరుపున శిక్షణాతరగతులు నిర్వహించాలని కోరారు.