జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంచేయుండి`ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు
శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న జల్‌జీవన్ మిషన్ పధకం పనులు వేగవంతం చేయాలని ఈ పధకానికి సంబందించి 2019నుంచి రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన తన వాటా నిధులు రు.1098కోట్లు విడుదల చేసేలా చూడాలని కేంద్ర జలశక్తి శాఖామంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఎంపి కింజరాపు రామ్మోహననాయుడు వినతిపత్రం అందచేశారు.ప్రతి ఇంటికి కుళాయి కనెక్షను ద్వారా స్వచ్చమైన త్రాగునీరు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ పధకం అమలు చేసిందన్నారు.ఈ పధకం ద్వారా ఉద్దానం ప్రాంతాలకు ఎంతో మేలు కలుగుతుందని ప్రజలకు తాగునీటికష్టాలు తొలుగుతాయని కాని రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం కేంద్రం సరిగ్గా దృష్టి సారించకపోవడం పనులునెమ్మదిగా జరుగుతున్నాయిని తెలిపారు.దీనివల్ల కేంద్రప్రభుత్వం లక్ష్యం సకాలంలో నెరవేరకపోవడం కాకుండా తాగునీటి కష్టాలు ప్రజలుకు తీరే అవకాశం లేకపోవడంతో కేంద్రప్రభుత్వం దృష్టి సారించి పనులు వేగవంతం చేయాలని ఎంపి కోరారు.