శ్రీకాకుళం: ప్రభుత్వ సంక్షేమ పధకాలు అమలు,భూసర్వే పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని జాయింట్ కలెక్టరు మల్లారపు నవీన్ అన్నారు.బుదవారం శ్రీకాకుళం జాయింట్ కలెక్టరు గా బాద్యతలు స్వీకరించారు.పౌరసరఫరాలుఅమలుతీరుపై దృష్టి సారిస్తానని వరికోనుగోలు ప్రభుత్వ భవననిర్మాణాలు పై సమిక్షలు నిర్వహించి అమలుతీరును ప్రత్యేకపర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు.అనంతరం కలెక్టరు శ్రీకేష్‌లాఠకర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.అనంతరం వివిద సెక్షన్‌లో సూపరెండెంట్‌లు,సిబ్బందిని కలుసుకున్నారు.