జిల్లాలో దొంగల ముఠా ప్రవేశించలేదు
శ్రీకాకుళం: జిల్లాలో దొంగల ముఠాలు ఏవీ ప్రవేశించలేదని అదనపు పోలీసు సూపరెండిరట్ (క్రైమ్)టి.పి విఠలేశ్వర్ తెలిపారు.దొంగలు ముఠాలు జిల్లాలోకి రాలేదని ,రానివ్వమని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రంలో కృష్ట,ప్రకాశం,గుంటూరు,తదితర జిల్లాలలో చెడ్డి గ్యాంగ్ ముఠా ప్రవేశించినట్లు సమాచారం వుందని ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా వుండాలని సందేశం ఇచ్చామని ,జిల్లాలో అయితే అటువంటి ముఠాలు అలజడి ఏమీ లేదని ,జిల్లా పోలీసుయంత్రాంగం మాత్రం అప్రమత్తంగా వుందని ప్రజలు కూడా అప్రమత్తంగా వుండాలని కోరారు.