టిటిడీ తరహాలో శ్రీశైలం దేవస్దానంలో ఆధార్ తప్పనిసరి…
శ్రీశైలం: తిరుమల తిరుపతి దేవస్దానం స్వామివారి దర్శనానికి ఆధార్ కార్డు తప్పని సరి అనే నిబందనలు ఇపుడు శ్రీశైలం దేవస్దానంకూడా అమలు చేస్తుంది.విఐపి,బ్రేక్ దర్శన టిక్కెట్లుకు ఆర్జిత సేవలకు ఆధార్ తప్పని సరి అని ఈఓ లవన్న తెలిపారు.సామాజిక మాధ్యమాలు ద్వారా,ప్రసారాలు భక్తులు కు సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు.భక్తులుకూడా ఈ విషయం అవగాహనతో రావాలని తెలిపారు.