ట్రాఫిక్ ఎస్‌ఐ మానవత్వం
శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణానికి చెందిన రిటైర్డు బిఎస్ ఎన్ ఎల్ ఉద్యోగి కొంత నగదు వస్తువులుతో తన బ్యాగును ఆటోలు పోగొట్టుకున్న తరువాత సమాచారం ట్రాఫిక్ ఎస్‌ఐ వెంకటేష్ అందించడంతో వాహనాలు తనిఖీలు నిర్వహించారు.తనిఖీలలో భాగంగా ఆటోనెం.ఎపి30వై2502 ఆటోలు బ్యాగును గుర్తించారు. సమాచారం ఉద్యోగి అప్పారావుకు అందించడంతో అప్పారావు ట్రాఫిక్ ఎస్‌ఐ వెంకటేష్ సిబ్బంది ఆద్వర్యంలో బ్యాగును అందించారు.అప్పారావు సిబ్బందికి అబినందించారు.ఈ సందర్బంగా ఎస్‌ఐ వెంకటేష్ మాట్లాడుతూ ట్రాఫిక్ ప్రయాణం చేసేటపుడు వస్తువులు జాగ్రత్తగా వుంచుకోవాలని దిగేటపుడు వస్తువులు సరిచూసుకుని జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.ఈ తనిఖీలలో సిబ్బంది హరిబాబు,మహేశ్వరరావు పాల్గోన్నారు.