ట్రాఫిక్ నిబందనలు పాటించాలి
శ్రీకాకుళం: వాహనదారులు ట్రాఫిక్ నిభందనలు తప్పకుండా పాటించాలని అలా పాటించనవారు వుంటే చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్‌ఐ లక్ష్మణరావు అన్నారు.శ్రీకాకుళం ఆర్‌టిసి కాంప్లెక్సు ఎదురుగా వాహనాలు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆటోడ్రైవర్లును అవగాహన కల్పించారు.ప్రయాణీకులు గమ్యం చేర్చేటపుడు ట్రాఫిక్ నిబందనలు వేగం నియంత్రణ తదితర అంశాలు పరిగణలోకి తీసుకోవాలని,ప్రతీ డ్రైవరుకు లైసెన్సులు తప్పనసరిగావుండాలని అలాలేకుండా డ్రైవింగ్ చేస్తే జరిమానా ,తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.ప్రతివాహనానికి తప్పనిసరిగా ఇన్ష్యూరెన్సులు వుండాలని,తెలిపారు.ఈ సందర్బంగా పలు వాహనాలు తనిఖీలు నిర్వహించారు.